మనిషి మనుగడకు జీవనాధారం : ఉదయ్‌ కుమార్‌

85
uday
- Advertisement -

తెలంగాణ ప్రోఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి పురస్కరించుకొని ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గోని మొక్కలు నాటారు. సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి ఈ రోజు జిల్లా కార్యాలయంలో మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… చెట్లు, మానవాళికి, మనిషి మనుగడకు జీవనాధారం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి చెట్లను పెంచడం, వాటిని సంరక్షించడం చేయాలని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేసినందుకు ఎంపీ సంతోష్‌ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్ని భవిష్యత్‌ తరాలను కాపాడుకోవాలన్నారు. తాను ఈ ఛాలెంజ్ ను ఆసిఫాబాద్ ఎస్పీ సురేష్ కుమార్, నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, మంచిర్యాల్ అడిషనల్ డీసీపీ అఖిల్ మహాజన్ లకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలు చేశారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఉమేందర్, విజయ్ కుమార్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, శ్రీపాల్, వంశీకృష్ణ, డీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ గుణవంతురావ్ రిజర్వ్ సిబ్బంది పోలీసు కార్యాలయం ఏవో యూనిస్ అలి, జోసెఫిన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -