రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి పాల్గోని మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన జిల్లా ఎస్పీ శుక్రవారం నిర్మాణంలో ఉన్న నూతన జిల్లా పోలీస్ కార్యాలయంలో మొక్కలు నాటడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు పోలీసుల వారి ఆద్వర్యంలో 3000 లకు పైగా మొక్కలు నాటడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఙతలు తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీతో పాటుమరో ముగ్గురు అధికారులకు ఛాలెంజ్ విసిరారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో విసిరారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్ని మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్యేశ్వరరావు, జిల్లా అదనపు ఎస్పీ ఏ.ఆర్ భీమ్ రావు , ఆసిఫాబాద్ డి.ఎస్.పి శ్రీనివాస్, పోలీస్ అధికారులు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.