అడ్డురసం మొక్క గురించి చాలమందికి తెలియదు. ఈ మొక్క ఎక్కువగా పల్లెటూళ్లలో కనిపిస్తూఉంటుంది. పొలం గట్లపైన లేదా రోడ్ల పక్కన పొదల్లో ఈ మొక్క కనిపిస్తుంటుంది. ఈ మొక్క ఒకటి నుంచి దాదాపుగా నాలుగు మీటర్ల వరకు పెరుగుతుంది. దీనియొక్క శాస్త్రీయనామం ఆడహతోడ వాసికా నీస్. ఈ మొక్కను చాలా రకాల ఆయుర్వేద ఔషధాలలో విరివిగా వినియోగిస్తూ ఉంటారు. దీని యొక్క ఆకులు, బెరడు, పుష్పాలు, వేర్లు.. ఇలా అన్నిట్లోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దగ్గు ఆయాసం, ఉబుసం వంటి వ్యాధులతో దీర్ఘకాలంగా వాడపెడేవారికి ఇదొక దివ్యఔషధంలా పని చేస్తుంది.
Also Read:ఏపీ ఎన్నికల ప్రచారంలో కొండా!
ఈ మొక్క యొక్క వేరును కశయంగా మార్చుకొని దానికి కొద్దిగా పంచదార చేర్చి ప్రతిరోజూ 15 మీ.లీ చొప్పున మూడు పూటలా తీసుకుంటే దగ్గు, ఆయాసం వంటి సమస్యలు దూరం అవుతాయి. అడ్డురసం మొక్కలోనూ అన్నీ భాగాలు ఉదరసమస్యలను నివారించడంతో పాటు సుఖవ్యాధుల నివారణలో కూడా అడ్డురసం పుష్పాలను, ఆకులను వాడతారు. ఇక అడ్డురసం ఆకుల యొక్క కషాయం ప్రతిరోజూ సేవిస్తే రక్త విరోచనలు, వాంతిలో రక్తం పడడం, మొండి జ్వరాలు వంటి సమస్యలు తగ్గుతాయి. గజ్జి, తామర, దురద, దద్దుర్లు.. వంటి చర్మ సమస్యలు ఉన్నవాళ్ళకి ఈ మొక్క ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. అడ్డురసం ఆకులతో కషాయం తయారుచేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడూ చర్మానికి పూస్తే పై సమస్యలన్నీ దూరం అవుతాయి. అడ్డురసం యొక్క కషయాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల కీళ్ల నొప్పులు, నరాల బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక ఈ మద్యకాలం లో కరోనా విరుగుడులో కూడా ఈ మొక్కను పరిశీలించారు వైద్య శాస్త్రవేత్తలు. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా అడ్డురసం మొక్కలో ఉన్నట్లు అపు అద్యయానాలు చెబుతున్నాయి.
Also Read:మూత్రవిసర్జనలో మంట వస్తోందా..!