మొక్కలు నాటిన జగిత్యాల అదనపు కలెక్టర్ అరుణశ్రీ..

105
gic

“పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ జె. అరుణశ్రీ స్వీకరించి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ గారిని ప్రతిపాదించారు.

ఈ చాలెంజ్ ను స్వీకరించి సపోటా, మందార మరియు వేప మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి,జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు,జడ్పీ సీఈఓ శ్రీనివాస్ పేర్లను ప్రతిపాదిస్తు వారు ముగ్గురు కూడా మూడు మొక్కలను నాటడంతో పాటు, మరో ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి హరిత తెలంగాణకు కృషి చేస్తున్నారని, హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారంచుట్టిన రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపెల్లి సంతోష్ కుమార్ గారికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు.