HIT3 హీరో ఎవరంటే ?

117
- Advertisement -

మంచి అంచనాల నడుమ హిట్ 2 ఇవ్వళే థియేటర్స్ లోకి వచ్చింది. హిట్ ఫ్రాంచైజ్ నుండి వరుసగా సినిమాలు వస్తాయని ప్రతీ సినిమాలో ఒక్కో హీరో కనిపిస్తాడని ఇప్పటికే టీం చెప్పేశారు. దీంతో హిట్3 లో కనిపించే హీరో ఎవరా ? అనే క్యూరియాసిటీ రైజయింది. ఇటివలే నాని , శేష్ అలాగే విజయ్ సేతుపతి ఈ కాంబోలో మూడో కేస్ తెరకెక్కనుందని ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. దీనికి శేష్ తను మాత్రం ఉన్న సంగతి చెప్పాడు తప్ప నాని , విజయ్ సేతుపతి గురించి క్లారిటీ ఇవ్వలేదు.

ఇక అన్నీ థియేటర్స్ లోనే అన్నట్టుగా ఇవ్వాళే హిట్3 లో కనిపించనున్న హీరోను హిట్2 క్లైమాక్స్ లో రివీల్ చేశారు. నెక్స్ట్ సిరీస్ లో నాని లీడ్ గా కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించి ఓ విజువల్ తో క్లారిటీ ఇచ్చారు. హిట్2 లో ఎండింగ్ లో శేష్ కి పెళ్ళవుతుంది. ఆ పెళ్ళికి ఆఫీసర్ వస్తున్నాడు అంటూ టీం చెప్పడం అప్పుడు ఓ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నానీ కారులో ఎంట్రీ ఇవ్వడంతో హిట్3 పై అంచనాలు పెంచేశారు.

హిట్ మూడో కేసులో నాని అర్జున్ సర్కార్ గా కనిపించబోతున్నాడు. కాస్త తిక్క ఉండే పోలీస్ గా నాని గురించి చెప్తూ క్లారిటీ కూడా ఇచ్చేశారు. వంద మంది అమాయకులు చనిపోయినా పరవాలేదు కానీ ఒక్క క్రిమినల్ కూడా తప్పించుకోకూడదనే నినాదాన్ని పాటించే కేరెక్టర్ ఇది. త్వరలోనే నాని హీరోగా హిట్ 3 మొదలు కానుంది. నానితో పాటు శేష్ కూడా కేస్ 3 ఉంటాడు. ఈ సిరీస్ లో ఆరో కేసుకో ఏడో కేసుకో అందరు హీరోలు ఓ కేసు కోసం కలుస్తారు.

ఇవి కూడా చదవండి…

‘హిట్ 2’ హిట్టే.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే !

విజయ్ దేవరకొండ కి అది చాలా అవసరం

ఎన్టీఆర్ చిత్రానికి ముహూర్తం కుదిరింది

- Advertisement -