విక్టరీ వెంకటేష్, ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్/ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌లో వెంకటేష్‌కున్న క్రేజ్, త్రివిక్రమ్ మార్క్ వినోదం కలగలిసి రానుండటంతో ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది.
ఇటీవల ఫస్ట్ సింగిల్ విడుదలలో కొంత ఆలస్యం జరగడంతో అభిమానుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ మేకర్స్ తాజాగా అధికారిక క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలోని మొదటి పాట ‘నారాయణమ్మ’ ను సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సంగీత దర్శకుడు తమన్ ఎస్ ఈ పాటకు ఎలాంటి స్వరాలు అందించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వెంకటేష్ సినిమాల్లోని పాటలకు ఉండే ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని, కుటుంబ ప్రేక్షకుల భావోద్వేగాలకు అద్దం పట్టేలా ఈ పాట ఉండబోతుందని సమాచారం.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. ‘నారాయణమ్మ’ పాట విడుదలతో మొదలయ్యే ఈ ప్రచార పర్వం, రాబోయే రోజుల్లో వరుస ప్రమోషనల్ కంటెంట్, టీజర్, ట్రైలర్‌లతో ప్రేక్షకులను మరిన్ని ఊరింపులకు గురిచేయనుంది. దసరా బరిలో దిగుతున్న ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
Also Read:Asian Games:భారత్‌కు మరో పసిడి

