దేశవ్యాప్తంగా సంచలన రేపిన అదానీ ఆస్తుల వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో… రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మోదీపైన ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ప్రస్తుతం అదానీ సుమారు 10 రంగాల్లో వ్యాపారం చేస్తున్నారని, మరి 2104 నుంచి 2022 వరకు ఆయన ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల నుంచి 140 బిలియన్ల డాలర్లకు ఎలా వెళ్లాయని యువత అడుగుతున్నారని ప్రశ్నించారు. తమిళనాడు, కేరళ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు అంతటా ఒక్కటే పేరు వినిపిస్తోందని, అంతటా అదానీ పేరే వినిపిస్తోందని రాహుల్ అన్నారు.
అదానీ ఏ కంపెనీ అడుగు పెట్టిన ఫెయిల్ కాలేకపోతున్నారని ఇది ఎలా సాధ్యమంటూ ప్రజలు అడుగుతున్నారని రాహుల్ గుర్తు చేశారు. కశ్మీర్‌లోని యాపిళ్ల నుంచి.. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్డుల గురించి కూడా అదానీ పేరు వినిపిస్తోందని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలను ప్రస్తావించలేదన్నారు. అగ్నివీర్ పథకాన్ని బలవంతంగా ఆర్మీపై రుద్దినట్లు ఆయన తెలిపారు. ఈ ఆలోచన ఎన్‌్ఎస్‌ఏ చీఫ్ అజిత్ దోవల్ నుంచి వచ్చిందని…ఆర్మీ ఆలోచన కాదన్నారు.
ఇవి కూడా చదవండి…
నెంబర్ ఒన్.. తెలంగాణే !
పట్నంకు వచ్చిన డబుల్ డెక్కర్ బస్సులు..
ఉపాధ్యాయుల బదిలీలకు కీలక నిర్ణయం..