వైర‌ల్ గా మారిన అదా శ‌ర్మ స్టిల్స్..

178
Gulebakavali
- Advertisement -

అందాల భామ ఆదాశ‌ర్మ సినిమాల క‌న్నా త‌న యాక్టివిటీస్ తో అందరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్, క్ష‌ణం చిత్రాలలో త‌న న‌ట‌న‌తో మెప్పించిన ఆదా సోష‌ల్ మీడియాలో వెరైటీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. కొద్ది రోజుల క్రితం పోల్ ఎక్రోబాటిక్ అనే యోగాస‌నం చేసి ఆ వీడియోని త‌న అఫీషియ‌ల్ పేజ్ లో పోస్ట్ చేసింది ఆదా. దీనికి నెటిజ‌న్స్ నుండి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది.

adah_sharma

తాజాగా మాంఛి మూడ్‌లో వున్నానంటూ ఈ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఆదా శర్మ. ఓ పోల్‌, ఆ పైన చివర్లో కూర్చుంది ఆదా శర్మ. ప్రస్తుతం ఆదా శర్మ తమిళంలో ఓ సినిమాలో నటించబోతోంది. ఆ ఆనందాన్నే, ఇలా ఫొటో రూపంలో వ్యక్తం చేసింది. ఇంతకు ఆదా శర్మ ఆ పోల్ పైకి ఎలా ఎక్కింది అని ఆశ్చర్యపోతున్నారా… దీనికి అసలు కారణం ఆదా శర్మ తల్లి ఈ ఫీట్లు నేర్చుకుందట ఆదా శర్మ. వయసు మీద పడ్డా ఆదా శర్మ తల్లి ఫిట్‌నెస్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడదట. తన తల్లే తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అని చెప్పే ఆదా శర్మ కూడా, ఈ సంప్రదాయ వ్యాయామ క్రీడలో ఆరితేరింది.

- Advertisement -