ది కేరళ స్టోరీపై వివాదం ఎందుకు….

32
- Advertisement -

ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ సినిమా వివాదాల్లోకి ఎందుకు వెళ్లింది. దీన్నిపై కేరళలలో రాజకీయ చర్చ ఎందుకు జరుగుతుంది. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. అదాశర్మ కీలకపాత్రలో పోషిస్తున్న ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. టీజర్‌లో బురఖా ధరించిన అదాశర్మ మాట్లాడుతూ…. నేను శాలినీ ఉన్ని కృష్ణన్‌ నేను నర్సు కావాలని అనుకుంటున్నాను అని అంటుంది కానీ తను పేరు మార్చుకున్నట్టు…తన పేరు ఫాతీమాబా అని తెలిపింది. నేను ఐఎస్ టెర్రరిస్టును ఇప్పుడు అఫ్గానిస్తాన్ జైలుల్లో ఉన్నాను. సాధారణంగా అమ్మాయిలను భయానక ఉగ్రవాదులుగా మారుస్తూ విధ్వంసకర గేమ్‌లు కేరళలో ఆడుతున్నారు. అంతా బహిరంగంగానే జరుగుతోంది అని ఆమె చెబుతున్నట్లు టీజర్‌లో కనిపిస్తుంది. అంతటితో కాకుండా నాలానే 32,000మంది మతం మారారు. వారు సిరియాల్లో యెమెన్‌లోని ఎడారుల్లో ఉన్నారు అని టీజర్‌లో కనిపిస్తుంది. విడుదలైన ఈ టీజర్‌ కేవలం ఆరురోజుల్లో 4,40,000కు పైగా వ్యూస్‌ వచ్చాయి.

అసలు వివాదం…
అదాశర్మ నటిస్తున్న ఈ సినిమాపై కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసిస్తున్నారు. #truestoryహ్యాష్‌ట్యాగ్‌తో ఈ టీజర్‌ను షేర్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు కొన్ని జరగవచ్చు. కానీ 32వేలా అని అసలు ఈ సంఖ్య నమ్మదగినిదిగా లేదని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని వాదిస్తున్నారు.

32వేల మంది అమ్మాయిలు మతం మారినట్టు గతంలోనే ప్రభుత్వం తెలిపిందని కుట్టీమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ… యేటా 2800 నుంచి 3200 మంది అమ్మాయిలు ఇస్లాంలోకి మతం మారుతున్నారు. పదేళ్లలో ఈ సంఖ్యను చూస్తే దాదాపు 32000అవుతుందని ది కేరళ స్టోరీ డైరెక్టర్‌ వివరించారు. ప్రస్తుతం ఇది రాజకీయ వివాదాస్పదమైంది. దీన్నిపై సమగ్రమైన వివరణ కొరుతున్నట్టుగా కేరళ ప్రభుత్వ ప్రతిపక్షాలు సినిమా యూనిట్‌ను కొరుతున్నారు. దీనిపై ఇంతవరకు ఏటువంటి వివరణ రాకపోవడంతో వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. అంటూ కేరళ వ్యాప్తంగా రాజకీయ దూమారం చెలరేగుతోంది.

ఇవి కూడా చదవండి…

పోస్ట్ ప్రొడక్షన్ లో ”నేనే సరోజ” !

ఇలియానా కళాతృష్ణ‌ తగ్గలేదట

హైదరాబాద్ తిరిగొచ్చిన చిరు

- Advertisement -