తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఉదయభాను. బుల్లి తెరపై, వెండి తెరపై ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఉదయభాను ఏ కార్యక్రమం చేసినా, ఏ స్టేజ్ షో నిర్వహించినా కూడా ఆ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చేది.ప్రస్తుతం సుమ ఎంత ఫేమస్‌గా ఉందో, కొన్ని సంవత్సరాల ముందు యాంకర్ ఉదయ భాను అంత కంటే ఎక్కువ ఫేమస్‌గా పేరు తెచ్చుకుంది.ఇప్పటికీ పడుచు అమ్మాయిగా కనిపించే ఉదయభాను ఈ మధ్యనే ట్విన్స్ ఆడపిల్లలకు కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన ఇద్దరు ఆడపిల్లల బాగోగులు చూసుకుంటూ.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.
ఎన్నో రోజులుగా సినిమా పరిశ్రమతో ప్రముఖులతో దూరంగా ఉన్న ఉదయభాను మళ్లీ వారందరిని కలుసుకుబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఓ పెద్ద స్టార్ హోటల్ లో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి ప్రముఖులందరిని తన కుటుంబంతో కలవనుందట. ఉదయభాను వారిని ఎందుకు కలుస్తుంది అని అనుకుంటున్నారా..? సెప్టెంబర్ 3వ తేదీన ఉదయభాను ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వచ్చే నెల సెప్టెంబర్ 3వ తేదీనాటికి వారు మొదటి పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. తన కవల పిల్లలు అయిన భూమి ఆరాధ్య – యువి ఆరాధ్య మొదటి పుట్టిన రోజు వేడుకలను ఉదయభాను దంపతులు గ్రాండ్ గా బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.