పెన్షన్ల ఫైల్‌పై తొలి సంతకం..

204
manchu vishnu
- Advertisement -

మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు మంచు విష్ణు. ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో నిర్వ‌హించిన‌ ఈ వేడుక‌కు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మోహ‌న్ బాబు, న‌రేశ్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

మంచు విష్ణు, ఆయ‌న ప్యానెల్ స‌భ్యుల‌ చేత మా ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు.విష్ణు ప్యానెల్ నుంచి గెలుపొందిన ర‌ఘుబాబు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు. విష్ణు ప్యానెల్ నుంచి ర‌ఘు బాబు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా గెలుపొందారు.

ఈ నెల 10న మా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్ర‌కాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’ )అధ్యక్షుడిగా మంచు విష్ణు 13వ తేదీన‌ బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -