మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్ చౌదరి నేహా

288
gic

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా యాంకర్ వింధ్య ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మణికోండ లోని తన నివాసంలో మొక్కలు నాటారు ప్రముఖ యాంకర్, జిమ్నాస్టిక్స్ చౌదరి నేహా.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బాధ్యతగా అందరూ మొక్కలు నాటి వాటిని రక్షించాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా తన మిత్రులు గీతా సౌజన్య; పూజా రామచంద్రన్; జాన్ కోకైన్; దివ్య దోబ్బాల ;నిఖిత నుకుము లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.