52 ఏళ్ల రికార్డును తిరగరాసిన..సినీ నటి సుమలత

309
sumalatha
- Advertisement -

కన్నడ సినీ నటుడు,దివంగత అంబరీష్ భార్య సుమలత కన్నడ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. చివరివరకు కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆమెకు మొండిచేయి మిగలడంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగింది. నిఖిల్ కుమారస్వామిపై 90వేల మెజార్టీతో ఘనవిజయం సాధించింది.

ఏ పార్టీ గుర్తు లేకుండా స్వతంత్య్ర అభ్యర్థిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టడం చాలా కష్టం. జాతీయస్ధాయి రాజకీయాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చివరిసారిగా 1967లో మైసూరు స్టేట్‌లోని కెనరా నియోజకవర్గం నుండి దినకర దేశాయ్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలిచి లోక్ సభలో అడుగుపెట్టగా గడచిన 52 ఏళ్లలో మరే స్వతంత్ర అభ్యర్థి పార్లమెంట్‌ గుమ్మం తొక్కలేదు.ఇప్పుడా చరిత్రను తిరగరాసింది సుమలత. సుమలత గెలుపుతో ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కన్నడ సినీ పరిశ్రమలో రెబల్‌స్టార్‌గా ,మాండ్య గండడుగా గుర్తింపు తెచ్చుకున్నారు అంబరీష్‌ మాండ్య. కాంగ్రెస్‌ తరఫున మాండ్య నుండి ఎమ్మెల్యేగా,ఎంపీగా సేవలందించారు. సిద్దరామయ్య కేబినెట్‌లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో సమాచారశాఖ సహాయమంత్రిగా సేవలందించారు.

- Advertisement -