నటి సుహాసిని షాకింగ్ కామెంట్స్!

16
- Advertisement -

సీనియర్ నటి సుహాసిని షాకింగ్ నిజానని బయటపెట్టారు. తనకు చిన్నపుడే టీబీ వచ్చిందని కానీ మందులు వాడటం ద్వారా టీబీని తగ్గించుకున్నట్లు చెప్పారు.90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది సుహాసిని.

ఇటీవలె క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టు రోల్స్ చేస్తుండగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. తనకు టీబీ సమస్య ఉంది కానీ ఆ విషయం తెలిసిన తర్వాత కూడా భయంతో ఎవ‌రికి తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాను అని వెల్లడించింది. ఎవ‌రికి ఈ విష‌యం తెలియ‌కుండా ఆరు నెల‌ల పాటు చికిత్స కూడా తీసుకున్నా అని సుహాసిని తెలిపింది.

ఆ తర్వాత అందరిలో టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్న‌ట్టు సుహాసిని తెలిపింది. టీబీ కారణంగా సుహాసిని ఒక్కసారిగా బరువు తగ్గిపోగా వినికిడి సమస్య కూడా మొదలయ్యిందట. అయితే చికిత్స తీసుకోవడంతో క్రమంగా సమస్య తగ్గుముఖం పట్టిందని సుహాసిని చెప్పుకొచ్చింది.

Also Read:బెట్టింగ్ యాప్స్‌ కేసులు..సీఐడీకి!

- Advertisement -