శ్రీలీల ప్రస్తుతం ఈ బ్యూటీ పేరు టాలీవుడ్ మారుమోగుతోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందD సినిమాతో ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. ఈమూవీతో అమ్మడు బాగానే అకట్టుకుంది. దీంతో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడి చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలీలకు భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. రెబల్ స్టార్ ప్రభాస్ నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమా తెలుగులో పెద్దగా అలరించకపోయినా.. నార్త్ రీజియన్‌లో ఇరగదీసింది. ప్రభాస్ ప్రస్తుతం సాహో తర్వాత ‘రాధే శ్యామ్’ అనే సినిమానే చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతికి విడుదల కావాల్సింది. ఓమిక్రాన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ‘రాధే శ్యామ్’ మూవీని మార్చి 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.