- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు నటి శ్రీష కుమార్. ఈ సందర్భంగా నటి శ్రీష కుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది మనము కూడా తిరిగి ఎంతో అంత ఇవ్వాల్సిన భాద్యత మన మీద ఉంది అన్నారు.
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా విజయానంద్, అపర్ణ, అర్జున్ కళ్యాణ్ వీరి ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు.
ఇవి కూడా చదవండి…
పసిడి ప్రేమికులకు శుభవార్త..
నిన్న ఆడియో, రేపు వీడియో
బండికి అధిష్టానం అక్షింతలు..
- Advertisement -