ఓటీటీలోకి షకీలా..!

28
Shakeela

ఒక నటి 250 సినిమాలు చేయటం చిన్న విషయం కాదు. అది కూడా శృంగార తారగా అంటే అసలు ఉహించలేం. దక్షిణాదిలో శృంగార తార అన్న వెంటనే షకీలా అన్న పేరున చప్పున గుర్తుకు రాక మానదు. తెరపై హాట్ అందాలతో నిద్ర లేకుండా చేసే షకీలా.. మలయాళం, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు.

ఇటీవ‌ల త‌న బ‌యోపిక్‌తో మరోసారి వార్త‌ల‌లోకి వ‌చ్చిన ష‌కీలా..నిర్మాతగా కూడా మారారు. ఆమె నిర్మాతగా మారిన తీస్తున్న అట్టర్ ప్లాప్, రొమాంటిక్ సినిమాల పోస్టర్లు విడుదల చేయగా వీటిల్లో ష‌కీలా కుమార్తె మిలా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన షకీలా…కొత్తగా చిత్ర పరిశ్రమలోకి వచ్చే వారికి ఇబ్బంది లేకుండా కె. ఆర్‌ డిజిటల్‌ ప్లెక్స్‌ పేరుతో సొంతంగా ఓటీటీని ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. దర్శకుడు ర‌మేష్ చెప్పిన స్క్రిప్ట్స్ నాకెంతో న‌చ్చాయి….ఈ రెండు చిత్రాల్లో నా కూతురు మిలా హీరోయిన్‌గా నటిస్తోంది. గోవాలో అందమైన లొకేషన్లలో షూటింగ్‌ చేస్తున్నాం అని వెల్లడించారు.