సినీ నటి సంజన మరో సారి వార్తల్లో నిలిచారు. సంజన తనపై బీర్ బాటిల్ తో దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు కన్నడ నిర్మాత నిర్మాత వందన జైన్. ఈ వార్త ఇప్పుడు కన్నడ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 24న బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన పార్టీకి ఇద్దరు కలిసి వెళ్లారు. పార్టీలో తనకు, సంజనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని.. కోపంతో సంజన తనను బీర్ బాటిల్తో కొట్టిందని నిర్మాత వందన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
తాజాగా ఈవిషయంపై స్పందించింది. హీరోయిన్ సంజన. తనకు బాలీవుడ్ నిర్మాత వందనతో గొడవ జరిగిన మాట నిజమేనని.. అయితే, అది చిన్నపాటి గొడవేనని తేల్చేసింది. గొడవకు సంబంధించి హోటల్లో రాజీ చేసుకున్నామని కూడా క్లారిటీ ఇచ్చింది సంజన. ఎలాంటి ఆధారాలు లేకుండా వందన తనపై ఆరోపణలు చేస్తుంది. నన్ను నా తల్లిని వందన ఇష్టం వచ్చినట్లు తిట్టింది. బెంగళూరులో వందనకు ఎలాంటి వ్యాపారాలు లేవని.. కానీ ఇక్కడ 200 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని సంజన డిమాండ్ చేసింది