- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శివ జ్యోతి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన నటి రోహిణి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గతంలో కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మీము టివి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది అని.
ఈ రోజు మళ్ళీ ఈ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా వర్ష, ఇమాన్యుల్, ఆశు రెడ్డి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.
- Advertisement -