తెలుగు చిత్ర పరిశ్రమలలో నవ్వులు పూయించిన మహిళ నటీమణుల్లో రమాప్రభ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్చుకున్నారు. అల్లు రామలింగయ్య, రాజాబాబులతో కలిసి ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆమె చేసిన ఎన్నో పాత్రలు ప్రేక్షకుల హృదయాలలో ఇప్పటికీ నిలిచిపోయాయి. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహానటి సావిత్రి గురించి ప్రస్తావించారు.
మహానటిలో చూపించినట్లుగా సావిత్రికి తాగుడును అలవాటు చేసింది జెమినిగణేషన్ కాదన్నారు. సావిత్రిని జెమినీ చాలా ప్రేమగా చూసుకునే వారని, చివరి వరకు ఆమెకు ప్రేమ పంచిన వ్యక్తి జెమిని గణేషన్. జెమిని మొదటి భార్య కూడా సావిత్రిని ప్రేమగా చూసుకునేదని, వాళ్లిద్దరూ ఎంతో సఖ్యతతో ఉండేవారని చెప్పుకొచ్చారు. ఇక సావిత్రి ఆస్పత్రిలో ఉన్నప్పుడు జెమిని పక్కనే కూర్చుని చాలా బాధపడేవాడు.
జెమినీ చెప్పినా వినకుండా సినిమా తీయడం వల్లే సావిత్రి నష్టపోయిందని, నేను ఆ సమయంలో సావిత్రి దగ్గర ఉండటం వలన నాకు ఈ విషయాలు తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. జెమిని గణేషన్ పిల్లలు అందరూ ఎంతో ప్రేమగా ఉండేవారని రమాప్రభా చెప్పారు.