తమిళనాట ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానపార్టీలన్ని ముందస్తు వ్యూహాలు రచిస్తుండగా కరుణానిధి,జయలలిత లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఈ సారి ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు సినీ నటి రాధిక. తమిళనాట సినీ రంగం నుండి రాజకీయాల్లోకి రావడం కొత్తకాకపోయినా రాధిక ఎన్నికల బరిలోకి దిగుతారని ఆమె భర్త,నటుడు శరత్ కుమార్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 2011లో సమత్తువ మక్కల్ కట్చి పార్టీని స్ధాపించిన శరత్ కుమార్ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోగా శరత్ కుమార్, ఏ నారాయణన్ లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అన్నాడీఎంకేతో జతకలిసి ఎస్‌ఎంకే బరిలోకి దిగనుంది.
అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే, బీజేపీ, ఎండీఎంకేతో పాటుగా మరికొన్ని చిన్న పార్టీలు ఉండగా, డీఎంకేలో డీఎంకే, కాంగ్రెస్ తో పాటు కొన్ని చిన్న పార్టులు ఉన్నాయి.