గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటి నవీనారెడ్డి..

145
Actress Naveena reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు సినీ నటి నవీనారెడ్డి జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నవీనారెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు అని అన్నారు. నేను కూడా ఈ రోజు పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతికి మేలు చేయాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి నవీనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె డైరెక్టర్ సుకుమార్,రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, చిరంజీవి సతీమణి సురేఖ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -