ఆ హీరోయిన్ ఎన్నికల్లో నిలబడుతుందట?

32
- Advertisement -

హీరోయిన్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఆ నాటి నటి శారద నుంచి నేటి రోజా, కంగనా రనౌత్ వరకూ రాజకీయ వాసనలను మరిగినవారే. ఈ లిస్ట్ లోకి తాజాగా మరో సీనియర్ హీరోయిన్ కూడా చేరింది. ఆమె పేరే నగ్మా. నిజానికి ఎప్పుడో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినా పెద్దగా రాణించలేకపోయింది. ఐతే, ఆమె సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాదు లోక్ సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసినట్లు తెలుస్తుంది. రాజకీయాల్లోకి వచ్చి నగ్మా చాలా నష్టపోయింది. ఎన్ని డబ్బులు పోయాయి అన్నది పక్కన పెడితే, ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి.

పైగా కమర్షియల్ హీరోయిన్ గా నగ్మా కూడా భారీ సక్సెస్ ను అందుకుంది. అలాంటి తాను రాజకీయాల్లో మాత్రం ఫెయిల్ అవ్వడంతో నగ్మా జీర్ణయించుకోలేకపోతుందట. అందుకే, ఆమె ఈ సారి తన అడుగులు సీరియస్ గా రాజకీయాల వైపు చూపు వేసిందని టాక్. ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ, చాలాకాలంగా ప్రధాని మోదీకి వీరాభిమానిగా ఉంది. ప్రధానికి అనుకూలంగా, బీజేపీకి వకల్తాగా ఆమె ఎక్కడా హడావిడి చేయకపోయినా.. బీజేపీ పెద్దలతో నగ్మా టచ్ లో ఉందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఐతే, ఆమె బీజేపీలో సభ్యురాలు కాదు. ఇప్పుడు అధికారికంగా ఆ పార్టీలో చేరుతారు అని చెప్తున్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నగ్మా హైదరాబాద్ నుంచి బరిలో నిలుపుతారు అని అంటున్నారు. మరి నగ్మా అన్ని పక్కన పెట్టి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందా అన్నది చూడాలి. ఐతే, 2009 లో జనరల్ లోక్‌సభ ఎన్నికలకు నగ్మా తన సీటు కోసం ప్రయత్నాలు చేసి తీవ్రమైన వివాదాలను ఎదుర్కొంది. కాకపోతే అది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆమె రాణించలేకపోయిందట. అదే బీజేపీలో ఆ పరిస్థితి లేదు అని నగ్మా బలంగా నమ్ముతుంది.

Also Read:Raviteja:ధమాకా గొప్ప ఆనందాన్నిచ్చింది

- Advertisement -