ఎవరికి భయపడను…

205
Actress Mumaith Khan on SIT notices
- Advertisement -

తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ 12 మంది సినీరంగానికి చెందిన ప్రముఖుల పేర్లు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంతో మాకు సంబంధం లేదని నందు,నవనీత్,తనీష్‌,సుబ్బరాజుతో సహా పలువురు బయటపెట్టగా తాజాగా ఆవార్తలపై ఐటెం బాంబ్ ముమైత్ ఖాన్ స్పందించింది.

డ్ర‌గ్స్ కేసులో త‌న‌కు సంబంధం ఉంద‌ని వ‌స్తోన్న వార్తల్లో నిజం లేదని వ్యాఖ్యానించింది. త‌న‌కు ఎలాంటి నోటీసులూ రాలేదని తెలిపింది. తాను త‌న ప‌నిలో బిజీగా ఉన్నానని చెప్పింది. తాను ఏ విష‌యాన్నైనా నిజ‌మైతే నిజ‌మ‌ని చెబుతానని, అబద్ధ‌మైతే అబద్ధ‌మ‌నే చెబుతానని వ్యాఖ్యానించింది.

ఆరోపణలు వస్తే, నన్ను అడిగి కన్‌ఫర్మేషన్‌ చేసుకుని, నా వాయిస్‌ కూడా విన్పించాలి తప్ప, ఊరికినే గాసిప్స్‌ ప్రచారం చేసెయ్యొద్దు..’ అంటూ ఓ వీడియో విడుదల చేసింది ముమైత్‌ఖాన్‌. ‘నేనెవరికీ భయపడాల్సిన పనిలేదు. నేనెప్పుడూ తప్పు చేయలేదు. డ్రగ్స్‌ తీసుకోలేదు. నా మీద అభియోగాలు మోపితే, విచారణ ఎదుర్కోవడానికి సిద్ధం..’ అంటోన్న ముమైత్‌ఖాన్‌, కెరీర్‌లో చాలా ఎత్తుపల్లాల్ని చూశాననీ, వివాదాలు తనకు కొత్త కాదనీ, ఎప్పుడూ ఏ వివాదంలోనూ తన తప్పు లేదని తేల్చి చెప్పింది.

తెలుగు తెరపై నిఖార్సయిన ఐటమ్‌ బాంబ్‌ అంటే అది కేవలం ముమైత్‌ఖాన్‌ మాత్రమే.. అనేంతలా ఒకప్పుడు ఓ ఊపు ఊపేసింది ‌. ‘ఇప్పటికింకా నా వయసు..’ అంటూ ‘పోకిరి’ సినిమాలోని ముమైత్‌ ఐటమ్‌ సాంగ్‌ని ఇప్పటికి మర్చిపోలేం.

- Advertisement -