మొక్కలు నాటిన నటి మని మహేష్..

195
Actress Mani Mahesh
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా యూసుఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో మొక్కలు నాటారు సినీ నటి మని మహేష్. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని సినీ నటి మని మహేష్ తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సినీ ఆర్టిస్ట్ ముకేశ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ యూసుఫ్ గూడ లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో మొక్కలు నాటిన సిని నటి మని మహేష్…అనంతరం మరో ముగ్గురు ( సినీ ఆర్టిస్ట్ లు కీర్తి , సంధ్య , శరత్ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -