గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సింగర్ సత్య యామిని..

327
Singer Satya Yamini

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సింగర్ సత్య యామిని మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా తీసుకెళ్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని సింగర్ సత్య యామిని తెలిపారు.

బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మణికొండలోని పంచావతి కాలనీలో మొక్కలు నాటిన సింగర్ సత్య యామిని..అనంతరం మరో ముగ్గురు ( సింగర్స్ మనీషా , రమ్య , అనుదీప్ ) లు కూడా నేను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మరో ముగ్గురికి ఛాలెంజ్‌ ఇవ్వాలని కోరారు.మొక్కలు నాటేల చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సింగర్ సత్య యామిని తెలిపారు.