GIC:హరితసేనలో నటి మహాలక్ష్మీ

8
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంలో జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు నటి,యాంకర్ మహాలక్ష్మి. ఈ సందర్భంగా మహాలక్ష్మి మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ హరితసేన లో భాగంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

అందరిని చిన్న, పెద్ద, పార్టీలకు అతీతంగా మొక్కలు నాటే కార్యక్రమం లో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఏడు సంవత్సరాల నుండి నిరంతరం మొక్కలు నాటే కార్యక్రమం ఒక యజ్ఞం లా తీసుకొని గ్రీనరి పెంచే దిశగా పని చేస్తున్న మాజీ రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:కేసీఆర్ కట్టిన సచివాలయం అద్భుతం:జగన్

- Advertisement -