యువకుడిని ఢీకొన్న నటి లహరి కారు…

197
lahari
- Advertisement -

సీరియల్ నటి లహరి కారు అతివేగంగా నడుపుతూ బైక్‌ను ఢీ కొట్టింది. బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రైవేట్ పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి డ్యూటీ ముగించుకుని శంషాబాద్ వైపు వస్తుండగా కారు ఢీ కొట్టింది. కారులోంచి దిగాలంటూ లహరిని పోలీసులు కోరారు. కిందికి దిగలేదు. దాంతో పోలీసులు ఆమెను కారులోనే పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

గాయపడిన వ్యక్తికి ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు.

- Advertisement -