లాక్‌డౌన్‌కు ముందు…లాక్‌ డౌన్ తర్వాత..!

1121
khushbu
- Advertisement -

వయసు పెరిగినా తరగని అందం ఆమె సొంతం…హీరోలకు దీటుగా తన నటనతో మెప్పించిన కుష్బూ…ఫైర్ బ్రాండ్ కూడా. బొద్దుగా ముద్దుగా ఉండే నటి కుష్బూ లాక్‌ డౌన్‌తో అందరికి షాకిచ్చింది. లాక్ డౌన్‌కు ముందు..లాక్ డౌన్‌కు తర్వాత అనేలా 3 నెలల్లో ఏకంగా 15 కిలోలు తగ్గి అందరిని మెస్మరైజ్ చేసింది.

బరువు తగ్గి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిన కుష్బూ…ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అస్సలు గుర్తుపట్టకుండా స్లిమ్‌గా ఉన్న కుష్బూను చూసి అంతా షాక్‌కు గురవుతున్నారు.

తెలుగు తమిళ భాషల్లో కథానాయికగా నటించి ప్రముఖ నటిగా రాణించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన కుష్బూ…ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. తమిళనాట కుష్బూకు గుడికూడా కట్టారంటే ఆమెకున్న క్రేజ్ అర్దం చేసుకోవచ్చు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న అన్నాత్త చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -