నేడు నటరాజ రామకృష్ణ..9వ వర్దంతి

672
ramakrishna
- Advertisement -

‘పద్మశ్రీ’ డా॥ నటరాజ రామకృష్ణ 9వ వర్దంతి నేడు. నాట్య కళా చరిత్ర పరిశోదకుడిగా చరిత్ర గతిలో బతికి జీర్ణమైపోయిన తెలంగాణ నృత్యరీతులను పునర్జీవింపచేసి, పూర్వ వైభవాన్నిమన కళ్ళముందు నిలబెట్టిన వ్యక్తి నటరాజ రామకృష్ణ.

మార్చి 31, 1933లో జన్మించిన నటరాజ రామకృష్ణకు చిన్ననాటినుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశారాయన. మీనాక్షీ సుందరం పిళ్లే, నాయుడుపేట రాజమ్మ ఆయన గురువులు.

రాష్ట్ర సంగీత నాటక అకాడమీకి అధ్యక్షునిగా సేవలందించిన నటరాజ రామకృష్ణ కళాకారునిగా, గురువుగా, మేధావిగా, సంగీతజ్ఞునిగా పేరొందారు. ఆరు దశాబ్దాల పాటు రాష్ట్రంలో సంప్రదాయ నాట్యకళలైన కూచిపూడి, పేరిణి నృత్యాలకు ఆయన విశేష సేవలందించారు.దక్షిణాది నృత్యరీతులమీద ఎన్నో పుస్తకాలు రాశారు. వందలాది మంది శిష్యులకు శిక్షణ ఇచ్చి కళాకారులుగా తీర్చిదిద్దారు.

- Advertisement -