సీనియర్ నటి జయంతి ఇకలేరు..

131
jayanthi

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి జయంతి (76) అనారోగ్యంతో ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ….ఇవాళ ఉదయం మరణించారు. జయంతి మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొనగా పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, హిందీ భాషల్లో 500 లకు పైగా చిత్రాల్లో నటించారు జయంతి. కన్నడ ఇండస్ట్రీలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటిగా గుర్తింపు తెచ్చకున్న ఆమె…1970,80 దశకంలో తిరుగులేని నటిగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. లెజెండరీ యాక్టర్స్ ఎంజీఆర్, రాజ్ కుమార్, ఎన్టీఆర్ లతో నటించి మెప్పించింది.

ఆమె నటించిన స్వాతికిరణం, శాంతి నివాసం, శ్రీదత్త దర్శనం, జస్టిస్‌ చౌదరి, రాజా విక్రమార్క, కొదమ సింహం, దొంగమొగుడు, కొండవీటి సింహం, అల్లూరి సీతారామరాజు, శ్రీరామాంజనేయ యుద్ధం, శారద, దేవదాసు ఇండస్ట్రీలో అప్పటికి,ఇప్పటికి,ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ చిత్రాలే.