గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటి ఇందు కుసుమ..

102
- Advertisement -

సినీ నటి ఇందు కుసుమ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇందు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం డైరెక్టర్స్ తేజ,రాకేష్ ఉప్పలపాటి,రాజా కొలుసు, రమేష్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -