Hema:రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు

44
- Advertisement -

కర్ణాటకలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ రేవ్ పార్టీలో 100 మందికి పైగా పాల్గొనగా ఇందులో 30 మంది మహిళలు ఉన్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా నటి హేమ ఈ పార్టీలో పాల్గొన్నట్లు ప్రచారం జరుగగా దీనిని ఖండించారు ఆమె.

రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని … తాను హైదరాబాద్ లోనే ఉన్నానని తెలిపారు. కన్నడ మీడియాలో తనపై జరుగుతుంది అంతా దుష్ప్రచారమేనని.. బెంగళూరు రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు హేమ ఓ వీడియోను విడుదల చేశారు. తాను ఏ నగరానికి వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. ఇక్కడ నా ఫామ్‌ హౌస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాను. నాపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి. అని కోరారు.

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో ఓ ఫాం హౌస్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది. స్థానిక జీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో వాసు అనే వ్యక్తి పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించినట్లుగా పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీన చేసుకున్నారు. టీవీ నటులు సహా, మోడల్స్, పలువురు వ్యాపార, రాజకీయ వారసులు కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ప్రచారం జరుగోంది.

Also Read:Chiru:’రాజు యాదవ్’ అలరిస్తుంది..

- Advertisement -