- Advertisement -
హీరోయిన్ హన్సిక ప్రస్తుతం ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రంలో నటిస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేంద్రరాజు నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రేవతి క్లాప్ ఇవ్వగా, వైష్ణవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వంశీ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం హన్సిక మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమాతో నా కెరీర్ మొదలైంది. కథానాయికగా నా 52వ చిత్రమిది. చాలా రోజుల తర్వాత మంచి కథతో సినిమా చేస్తున్నా. స్వేచ్ఛ, స్వతంత్ర భావాలు కలిగిన శృతి అనే యువతిగా కనిపిస్తా. ఆద్యంతం ఆసక్తిగా కథ సాగుతుంది’’ అని చెప్పారు. సోమవారం నుంచి తొలి షెడ్యూల్ మొదలుపెడతాం. ఈ నెలాఖరున సెకండ్ షెడ్యూల్, ఆగస్ట్‌లో మూడో షెడ్యూల్ ప్రారంభిస్తామన్నారు.
- Advertisement -