‘గాడ్సే’.. సత్యదేవ్‌ న్యూ లుక్‌..

162
Satyadev
- Advertisement -

టాలీవుడ్‌ హీరో సత్యదేవ్‌.. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తు దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో ‘గాడ్సే’ చిత్రంలో నటిస్తున్నారు. గోపీగణేష్‌ పట్టాభి దర్శకత్వంలో సి.కె. స్ర్కీన్స్‌ బ్యానర్‌పై సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఆదివారం సత్యదేవ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని కొత్త లుక్‌ను విడుదల చేశారు.

ఎడమచేతిలో గన్‌ పట్టుకుని ఇంటెన్స్‌ లుక్‌లో సత్యదేవ్‌ కనిపిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిన షూటింగ్‌ ఈ నెల ద్వితీయార్ధంలో ప్రారంభంకానుంది. యాక్షన్‌ ప్యాక్‌డ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక. నాజర్‌, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్‌, కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -