టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిష ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగువెలిగింది. ఆమె అందం, నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తెలుగులో వర్షం సినిమాతో ప్రేక్షకుల మనసు దోచేసుకుందని చెప్పుకోవాలి. త్రిష ప్రస్తుతం తమిళ్ సినిమాల్లో బిజీగా ఉంది. నేడు త్రిష పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినిమాకు సంబంధించిన వారు సోషల్ మీడియా ద్వారా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు.
మరో సీనియర్ హీరోయిన్ ఛార్మీ త్రిషకు వెరైటీగా బర్త్ డే విషెష్ తెలియజేసింది. బేబీ నిన్ను నేనెప్పటికీ ప్రేమిస్తుంటాను. నా అభ్యర్థనను నువ్వెప్పుడు అంగీకరిస్తావని ఎదురుచూస్తున్నా. పెళ్లి చేసుకుందామా. ఇప్పుడు ఇది చట్టంబద్ధం కూడా అని ట్వీట్ చేసింది చార్మీ. అయితే ఈట్వీట్ ను చూసిన త్రిష నేను పెళ్లికి రెడీ బేబి అని రిప్లై ఇచ్చింది. తెలుగులో వీరిద్దరూ కలిసి పౌర్ణమి సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. త్రిష ఇప్పటికి హీరోయిన్ పాత్రలు వేస్తున్నా చార్మీ మాత్రం నిర్మాతగా తన సెటిల్ అయ్యింది.
Baby I love u today n forever
![]()
Am on my knees waiting for u to accept my proposallet’s get married
( now toh it’s legally allowed also
) #happybirthday @trishtrashers
pic.twitter.com/e2F3Zn3Dp3
— Charmme Kaur (@Charmmeofficial) May 4, 2019