మొక్కలు నాటిన యూట్యూబ్ స్టార్ భాను..

294
Actress Bhanu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి హీమజ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన యూట్యూబ్ స్టార్ భాను నేడు వడ్డేశ్వరం (గుంటూరు)లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం.

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనం పెంచడం కోసం కృషి చేయాలని ఇది మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. నాకు కూడ మొక్కలు నాటే అవకాశం రావడం సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా నేను మరొక ముగ్గురికి యువ సినీ ఆర్టిస్టులు ‌నందురామిశెట్టి; దీప్తి సునైనా; క్రిష్టన్ రవళి లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -