అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘బంగారు బుల్లోడు’ టీజ‌ర్ రిలీజ్‌

105
bangaru bullodu

కింగ్ ఆఫ్ కామెడీ టైమింగ్ అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘బంగారు బుల్లోడు’ సినిమా టీజ‌ర్ జూన్ 30 మ‌ధ్యాహ్నం 3:06 గంట‌ల‌కు విడుద‌ల‌య్యింది. పి.వి. గిరి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న నాయిక‌గా అందాల తార పూజా ఝ‌వేరి న‌టిస్తోంది.

ఒక నిమిషం నిడివి క‌లిగిన ఈ టీజ‌ర్ ద్వారా ‘బంగారు బుల్లోడు’ చిత్రం ఆద్యంతం మ‌న‌ల్ని న‌వ్వుల్లో ముంచెత్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. కామెడీ టైమింగ్‌లో తాను కింగ్‌న‌ని మ‌రోసారి ఈ చిత్రంతో అల్ల‌రి న‌రేష్ నిరూపించబోతున్నారు. ఆయ‌న ఒక బ్యాంక్ ఉద్యోగి అనీ, ఆ బ్యాంక్ లాకర్‌లో ఉండే బంగారు న‌గ‌ల చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌నీ టీజ‌ర్ ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు. స‌స్పెన్స్‌, సెంటిమెంట్ అంశాలు మేళ‌వించిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.