అలనాటి స్టార్ హీరోయిన్, సీనియర్ నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో తన భర్తపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ”నా భర్త బిజినెస్ మ్యాన్ కావడంతో, పెళ్లికి ముందే ఆయన సినిమాలకు దూరంగా ఉండాలని చెప్పాడు. కారణం అడిగితే.. నా భార్య మరొకరితో రొమాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు అన్నారు. ఆయన మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది. అందుకే, ఆ టైంలో నేను సినిమాలకు దూరంగా ఉంటాను అని ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడైతే అలాంటి కండిషన్‌కి నేను ఎందుకు ఒప్పుకున్నానో అనిపిస్తుంది. ఈ తరం వారిని చూస్తుంటే నాకు అసూయగా ఉంది. వారు ఎవరి కోసం తమ కెరీర్ ను వదులుకోవడం లేదు. అదే కరెక్ట్ అని నా అభిప్రాయం’ అని ఆమని చెప్పుకొచ్చింది.
ఆమని ఇంకా మాట్లాడుతూ.. ‘అందుకే నేను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని నా భర్తకు తెలియకుండానే నిర్ణయం తీసుకున్నాను. మళ్లీ సినిమాలు చేస్తానంటే నా భర్త ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. అందుకే, ఆయనకు నేను నా సినిమాల గురించి ఏమీ చెప్పలేదు. కానీ, ఆ తర్వాత ఆయనకు నిజం తెలిసింది. అయినప్పటికీ.. ఆయన నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు” అని ఆమని తెలిపింది. హీరోయిన్ ఆమని మలయాళ బిజినెస్ మెన్ ‘ఖాజా మొహియుద్దీన్’ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
Also Read:‘కల్కి 2898’ కథ..రిలీజ్ డేట్ అదే
ఈ మధ్యకాలంలో ఆమని తన భర్త ఖాజా మొహియుద్దీన్ కు విడాకులు ఇవ్వబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమని కామెంట్స్ చూసి ఆమె తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ కామెంట్లను దృష్టిలో పెట్టుకునే ఆమని తాజా ఇంటర్వ్యూలో తన భర్త గురించి వివరంగా చెప్పుకొచ్చింది.
Also Read:తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ..దాశరథి