ఎస్పీబీ మృతి పట్ల విజయశాంతి సంతాపం..

267
vijayasanthi
- Advertisement -

ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీనటి విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. గాన గంధర్వుడు శ్రీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేనిది. కోట్లాదిమందికి గానామృతాన్ని పంచిన శ్రీఎస్పీబీ త్వరగా కోలుకుని మళ్ళీ తన గానంతో అలరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్రంగా కలచివేసిందని ఆమె అన్నారు. గాయకుడిగా, సంగీత దర్శకునిగా నటునిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎస్పీబీ ఎంత ఎత్తుకు ఎదిగినా చివరి క్షణం వరకూ వినయ విధేయతలతో ఒదిగే ఉంటూ ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు.

తన అపార అనుభవాన్ని ఎందరో బాలబాలికలు, యువతీయువకులకు పంచి మన సంగీత వారసత్వం భావితరాలకు అందాలని తపనపడ్డారు. పాట ఉన్నంత కాలం ఎస్పీబీ మన హృదయాల్లో సదా నిలిచే ఉంటారు. బాలుగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని తెలిపారు.

- Advertisement -