తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఇప్పటికే కృష్ణంరాజు, కృష్ణ, కైకాల, చలపతి రావు లాంటి సీనియర్ నటులు కాలం చెందారు. ఈ విషాదాలను ఇంకా మరువకముందే మరో తెలుగు సీనియర్ నటుడు కూడా మృతి చెందడం బాధాకరమైన విషయం. ప్రముఖ తెలుగు సినీ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్ధన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో ఆయన కాసేపటి క్రితం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
కాగా, వల్లభనేని జనార్ధన్ 120కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్లతో ఆకట్టుకుంటున్న జనార్ధన్.. ఆయన మెగాస్టార్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్ ‘సినిమాలో చేసిన ఎస్పీ పాత్రకు మంచి పేరు వచ్చింది. వల్లభనేని జనార్ధన్ ఫ్యామిలీలో ఈ ఉదయం విషాద ఉదయంగా మారిపోయింది. వల్లభనేని జనార్ధన్ గారి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరగనున్నాయి. వల్లభనేని జనార్ధన్ గారు ప్రజా జీవితంలోనూ ఎంతో హుందాగా మెలిగారు.
అలాగే తన సినీ జీవితంలోనూ వల్లభనేని జనార్ధన్ గారు ఎంతో బాధ్యతాయుతంగా తన సేవలు అందించారు. మా ‘ గ్రేట్ తెలంగాణ.కామ్ తరఫున వల్లభనేని జనార్ధన్ గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
ఇవి కూడా చదవండి..