పంజగుట్ట వద్ద బస్సులో కాల్పులు జరిపింది ఇతనే..!

194
Gunshot fired inside RTC bus

ఈ రోజు ఉదయం పంజగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులతో గొడవపడి కాల్పులు జరిపింది ఓ పోలీస్‌గా గుర్తించారు. ఏపీ రాష్ట్ర ఇంటలిజెన్స్ వింగ్‌‌లో శ్రీనివాస్ పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్‌ను వెస్ట్‌జోన్ పోలీసులు కూకట్‌పల్లిలోని అతని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి విచారిస్తున్నట్లు ఏసీపీ రాధాకిషన్‌రావు వెల్లడించారు.

ఈ ఘటనకు కారకుడిగా అనుమానిస్టూ ఓ టీవీ చానల్‌కు చెందిన కెమరామెన్‌ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ చానల్‌కు సంబంధించిన యజమానులకు సమాచారం అందించారు. ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుండగా అభ్యంతరం తెలపడంతోనే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏపీ డీజీపికి కూడ తెలంగాణ పోలీసులు సమాచారమిచ్చారు. ప్రజల మధ్య కాల్పులు జరపడాన్ని ఏపీ డీజీపీ ఠాకూర్ తప్పుబట్టారు.జనాల మధ్య కాల్పులు జరపడం పెద్ద నేరమని ఆయన అభిప్రాయపడ్డారు.