మొక్కలు నాటిన రోషం బాలు..

176
green challenge

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ ఉద్యమకారుడు, సినీనటుడు రోషం బాలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ద్వారా హరిత విప్లవం తీసుకొచ్చారని, పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యతగా స్వీకరించి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొనాలని ముగ్గురికి ఛాలెంజ్ విసిరి.. హీరో సంపూర్ణేష్ బాబు, ‘ఎంసీఏ’ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ మరియు ‘నీది నాదీ ఒకే కథ’ చిత్త్ర దర్శకుడు వేణు ఉడుగులను మొక్కలు నాటాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు.