తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు..

246
corona
- Advertisement -

తెలంగాణలో రాష్ట్రంలో రోజు రోజు కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా ఈ రోజు 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 816 కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. తాజా వివరాల ప్రకారం తెలంగాణలో నేడు 983 కరోనా కేసులు నమోదైతే..4 చనిపోగా.. 244 మంది డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 82,458 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. అందులో 68,039 నెగిటివ్ వచ్చాయి. 14419 పాజిటివ్ కేసులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9000 మంది యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 2172 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 247 మంది చనిపోయారు.

భద్రాద్రి కొత్తగూడెం 5, కరీంనగర్ 3, సిద్దిపేట 3, మహబూబ్ నగర్ 1, ఆదిలాబాద్ 2, ఖమ్మం 3, జనగాం 1, మెదక్ 1, సూర్యాపేట 1, గద్వాల్ 2, నిజామాబాద్ 1, రంగారెడ్డి 47, మేడ్చల్ 29, వరంగల్ అర్బన్ 12, మంచిర్యాల 33, వరంగల్ రూరల్ 19, నల్లగొండ 3, సంగారెడ్డి 1, కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 14,000 దాటాయి.

- Advertisement -