మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు…

91
petrol price

దేశంలో మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచాయి చమురు కంపెనీలు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.43, లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.53కి చేరింది.

వరుసగా ఐదు రోజలపాటు పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరల పెరుగుదల కొనసాగింది. మళ్లీ సోమవారం కూడా పెట్రోల్‌ కంటే లీటర్‌ డీజిల్‌ ధర 8 పైసలు అధికంగా ఉన్నది. దేశంలో మొదటిసారిగా జూన్‌ 24న డీజిల్‌ ధరలు పెట్రోల్‌ ధరలను దాటాయి.

దీంతో ఇప్పటివరకు డీజిల్‌పై మొత్తం రూ.10.39, పెట్రోల్‌పై రూ.9.23 పైసలు పెరిగాయి. శనివారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పెంచిన సంగతి తెలిసిందే.