రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..కేటీఆర్ హర్షం

198
canada
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రెండ్లీ పారిశ్రామిక పాలసీతో పెట్టుబడులు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. తాజాగా కెనడాకు చెందిన ఇవాన్‌ హో కేంబ్రిడ్జ్‌ అండ్‌ లైట్‌ హౌస్‌ కాంటన్‌ జీనోమ్‌ వ్యాలీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

దాదాపు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.740కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో.. ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్ ఇండియా ఎండీ చాణక్య చక్రవర్తి, సంస్థ సీనియర్‌ ప్రతినిధులు శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సిన్హా సమావేశమయ్యారు.

కెనెడియన్ ఫండ్ దక్షిణాసియాలో లైఫ్ సైన్సెస్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి అని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ రోజు ఇవాన్ హో కేంబ్రిడ్జ్ భారీ పెట్టుబడి లైఫ్ సైన్సెస్ రంగ మౌలిక వసతుల కల్పనలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీలో మరింత లాబొరేటరీ స్పేస్ పెరగడంతో పాటు పరిశోధన, అభివృద్ధి, లైఫ్ సైన్సెస్ అనుబంధ రంగాల మౌలిక వసతులు రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీకి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -