చార్మినార్ వద్ద సిగరెట్ తాగిన హీరో రామ్.. ఫైన్ వేసిన పోలీసులు

306
hero-ram smoking Cigarate
- Advertisement -

బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం నేరం అని పోలీసులు ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఈ మధ్య హైదరాబాద్ లో బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్ తాగుతూ పోలీసుల కంట్లో పడితే ఫైన్ వేస్తున్నారు. అలాగే తాజాగా హీరో రామ్ పొత్తినేని కూడా బహరంగ ధూమపానం చేసి పోలీసులకు రూ.200ఫైన్ కట్టాడు.

ismart-shankar1

హైదరాబాద్ చార్మినార్ లో ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈసినిమాలో రామ్ పక్కా మాస్ లుక్ లో కనిపించనుండటంతో ఆయన సిగరెట్ తాగే సీన్లు ఉన్నాయి. అయితే అది ఆయ‌న కావాల‌ని చేసింది కాదు.. సినిమా షూటింగ్‌లో భాగంగానే రామ్ సిగ‌రెట్ తాగుతున్నాడు. అయితే అది నో స్మోకింగ్ జోన్ కావ‌డంతో అస‌లు స‌మ‌స్య వ‌చ్చింది.

ఒక‌వేళ షూటింగ్ కోసం స్మోక్ చేయాల‌న్నా కూడా దానికి పోలీస్ ప‌ర్మిష‌న్ ఉండాలి. అయితే షూటింగ్ కోసం అనుమ‌తి తీసుకున్నా కూడా స్మోకింగ్ కోసం తీసుకోలేదు. ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఛార్మి కౌర్ పూరీ క‌నెక్ట్స్‌తో క‌లిసి పూరీ టూరింగ్ టాకీస్ సంస్థ‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 18న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

- Advertisement -