వేణు మాధవ్ మరణం తీరని లోటుః హీరో రాజశేఖర్

571
venu rajashekar
- Advertisement -

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు సీనియర్ నటుడు రాజశేఖర్. ఈసందర్భంగా వేణు మాధవ్ తో తనకున్న అనునబంధాన్ని గుర్తు చేసుకున్నారు రాజశేఖర్. వేణు మాధవ్ తమ కుటుంభంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారన్నారు. జీవితను అక్కా అని నన్ను బావ అని ప్రేమతో పిలిచేవారని చెప్పారు. మా ఫ్యామిలీ అంటే తనకు చాలా అభిమానం అని..వేణు మాధవ్ నేను కలిసి దాదాపు 10సినిమాల్లో నటించినట్లు తెలిపారు.

ఆయనకు ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేసేవాడన్నారు. ఇంత తొందరగా ఆయన మననుంచి వెళ్లిపోతాడని అనుకోలేదన్నారు. వేణు మాధవ్ తో చివరిసారిగా దిగిన ఫోటోను విడుదల చేశారు రాజశేఖర్. ఇక వేణు మాధవ్ భౌతిక కాయాన్ని యశోద ఆసుపత్రి నుంచి తన స్వగృహానికి తరలించారు. రేప మధ్యాహ్నం అభిమానుల సందర్శనార్ధం ఫిలీం ఛాంబర్ లో ఉంచనున్నారు.

- Advertisement -