హీరో రాజశేఖర్ పై కేసు నమోదు

288
hero rajashekar

ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో విషాదంగా నెలకొంది. రాజశేఖర్ కు మరోసారి ప్రమాదం కావడంతో ఆయన కుటుంబంతో పాటు అభిమానులు కూడా ఆందోళనలో పడ్డారు. అయితే ఈ ప్రమాదంలో రాజశేఖర్ కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఉపిరిపిల్చుకున్నారు. సరిగ్గా 1.20 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అక్కడున్న వాళ్లు చెప్పిన సమాచారం తీసుకుని కొన్ని నిమిషాల తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అయితే ప్రమాదం తర్వాత హీరో రాజశేఖర్ వేరే కారులో వెళ్లిపోయారు. ఈ ప్రమాదం కావడానికి కారణం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్ వల్లే అని పోలీసులు చెబుతున్నారు. అయితే రాజశేఖర్ మద్యం సేవించి వాహనం నడిపారని అలేగే రాజశేఖర్ కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయని వాస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు పోలీసులు. హీరో రాజశేఖర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ కింద సెక్షన్ ఐపీసీ 279 కింద కేసు నమోదు చేశారు.