రాజకీయాలకు బండ్ల గణేశ్ గుడ్ బై

279
Bandla Ganesh
- Advertisement -


సినీ నటుడు, ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేణ్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు బండ్ల గణేశ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కప్పు కండువా కప్పుకున్న ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని తెలిపారు.

తనకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని తెలిపారు బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నానన్నారు.

ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్, షాద్ నగర్ లేదా జుబ్లిహిల్స్ నుంచి టికెట్ ఆశించారు బండ్ల. కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఉండటంతో బండ్లకు అవకాశం దక్కలేదు. తాజాగా బండ్ల గణేశ్ చేసిన మరో ట్వీట్ ఆసక్తిరేపుతుంది. ఏపీకి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన రెండు రోజులకే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బండ్ల గణేశ్ అతి తక్కువ కాలంలో రాజకీయాల నుంచి తప్పుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -